ఆకాళరాత్రి (డిసెంబర్ 2-3, 1984) మీరు ఎక్కడ ఉన్నా రు? భోపాల్ విషవాయువు దుర్ఘటనపై కిందిస్థాయి న్యాయస్థానం ఒకటి పక్షం రోజుల క్రితం తీర్పు వెలువరించి న దరిమిలా న్యూస్ మీడియాలో పదే పదే ప్రస్తావనకు వస్తు న్న ప్రశ్న అది. దీనికంటే చాలా ముఖ్యమైన, సరైన సమాధా నం కోసం దేశ ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రశ్న: ఆ ఘోర పారిశ్రామిక ప్రమాదం సంభవించిన వారం రోజుల లోపే యూనియన్ కార్బైడ్ అధిపతి వారెన్ ఆండర్సన్ భార త్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవడానికి అనుమతించిందెవరు? సప్తపదుల, అష్టపదుల వయస్సులో ఉన్న, దాదాపుగా విశ్రాంత జీవితం గడుపుతున్న రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వాధికారులు ఈ ప్రశ్నకు విశ్వసనీయమైన సమాధానమివ్వడానికి ప్రయత్నిస్తున్నారు, కాదు ప్రయాసపడుతున్నారు.
ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ప్రత్యేక దర్యాప్తు అవసరమేమీలేదు. నిజానికి భారత ‘రాజ్యమే’ ఆండర్సన్ స్వదేశానికి ‘సురక్షితంగా’ వెళ్ళిపోవడానికి అనుమతించింది. ఈ వాస్తవాన్ని ధ్రువీకరిస్తున్న (లిఖితపూర్వక, దృశ్యపరమైన) సాక్ష్యాధారాలు కావలసినన్ని ఉన్నాయి. 1984లో భారత ‘రాజ్యం’అంటే -భోపాల్‌లో అర్జున్ సింగ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, న్యూఢిల్లీలో రాజీవ్ గాంధీ సారథ్యంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం.
దురదృష్టవశాత్తు ఈ మౌలిక వాస్తవాన్ని ఆమోదిస్తున్నవారు ఎవరూ లేనట్టుగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రతిరోజూ ఖండన ప్రకటనలు వెలువడుతున్నాయి; నిన్న చెప్పినదాన్ని నేడు కాదంటున్నారు; రేపు కొత్త విషయాలు వెల్లడిస్తున్నారు! ఇదంతా ఒక ప్రహసనంలా సాగిపోతోంది. ఎందుకంటే 15 వేల మందికి పైగా ప్రజలు చనిపోయిన ఒక దుర్ఘటనతో ఏమీ సంబంధం లేనట్టుగా ప్రకటనలు, వాటికి ఖండనలు వెలువడుతున్నందునే అలా అభివర్ణించవలసి వచ్చింది.
బుద్ధుడు మాదిరిగా అర్జున్ సింగ్ మౌనం వహిస్తున్నారు; కాంగ్రెస్ తమ ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీని సమర్థించడాని కి అతిగా ప్రతిస్పందిస్తోది. ఇక ప్రతిపక్షాలు అయితే భోపాల్ దుర్ఘటన సందర్భంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు అత్యవసర పరిస్థితి విధింపుతో పోలిక పెడుతున్నాయి.
నిజానికి అర్జున్ సింగ్ మౌనంగానీ, రాజీవ్ ప్రతిష్ఠకు మచ్చబడుతుందేమోననే అనుమానంతో కాంగ్రెస్ పార్టీ గుండె బాదుకోవడం గానీ సమర్థనీయం కాదు. ఆండర్సన్ స్వేచ్ఛగా స్వదేశానికి వెళ్ళిపోయేందుకు అనుమతించేందుకు తనకు అధికారం లేదని అర్జున్ సింగ్ అనడం హాస్యస్పదం గా లేదూ? మధ్యప్రదేశ్ నాడు అర్జున్ సింగ్ పాలనలో ఉన్న ది.
రాష్ట్రంలో ఆయన మాటకు తిరుగులేదు. పైగా ఆండర్సన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ విమానంలోనే న్యూఢిల్లీకి వెళ్ళిపోయా రు. ట్రయల్ కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో ఐపిసి సెక్షన్ 304 (హత్యగాని మానవ హతం) కింద నమో దు చేసిన ఆరోపణలను ట్రయల్ కోర్ట్‌లో పోలీసులు తొలగించారు. ఎందుకు తొలగించారు? ఎవరి ఆదేశాలపై అర్జున్ సింగ్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే హక్కు దేశ ప్రజలకు ఉన్నది.
అయితే ఆండర్సన్ ‘పలాయనం’లో రాజీవ్ గాంధీకి ఆపాదిస్తున్న ప్రమేయం విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు అంతగా కలవర పడుతున్నారు? ప్రతిపక్షాలు ఎందుకంత తీవ్ర విషయంగా పరిగణిస్తున్నాయి? నెహ్రూ-గాంధీ వంశంతో పేగు సంబంధమున్న కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వెలువడే ఎంత చిన్న వ్యాఖ్యపైన అయినా పెద్దగా మండిపడుతుంది.
అందునా భోపాల్ విషవాయువు దుర్ఘటనకు సంబంధించిన ఆండర్సన్ ‘పలాయనం’ విషయంలో రాజీవ్ ప్రమేయమున్నదని అంటే ఇక చెప్పేదేముంది? ‘ఈ వ్యవహారంలోకి రాజీవ్ పేరును లాగడం ఎంత సాహసం’అని కాంగ్రెస్ బడా, చోటా నాయకులు గర్జిస్తున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబంపై ఉన్న వ్యతిరేకత ప్రాతిపదికగా దశాబ్దాల నుంచి మనుగడ సాగిస్తున్న ప్రతిపక్షా లు భారత రాజకీయాల ప్రథమ కుటుంబా న్ని ఇబ్బంది పెట్టడానికి దొరికిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాయి?
ఆండర్సన్‌ను భారత్ నుంచి స్వేచ్ఛగా స్వదేశానికి వెళ్ళిపోనివ్వడంలో ఇబ్బంది కల్గించే అంశమేమీ లేదు. ఆ మేరకు నిర్ణయాన్ని రాజీవ్ గాంధీ తీసుకొని వున్నట్టయితే అది ఆయ న తీసుకున్న ఉత్తమ నిర్ణయాలలో ఒకటని నిస్సందేహంగా చెప్పవచ్చు (అటువంటి ముఖ్యమైన నిర్ణయం గురించి ప్రధానిగా ఉన్న వ్యక్తికి తెలియదనడం విశ్వసించలేని విషయం కాదూ?) బాబ్రీ మసీదు గేట్లు తెరిపించినందుకు, 1987లో జమ్మూ- కాశ్మీర్ శాసనసభా ఎన్నికలలో రిగ్గింగ్ జరపడానికి రహస్యంగా సమ్మతించినందుకు, ఎల్‌టిటిఇ సమస్య విషయంలో అనుసరించిన వైఖరికి మీరు రాజీవ్‌ను తప్పుపట్టవచ్చు.
ఈ అంశాలన్నిటిలోనూ ఆయన నిర్ణయాలు భయాన క పర్యవసానాలకు దారితీశాయి. అయితే ఆండర్సన్ వ్యవహారంలో ఆయన, బహుశా, సరైన ప్రత్యామ్నాయాన్నే ఎంచుకున్నారని చెప్పవచ్చు. 1984 డిసెంబర్ 2010 జూన్ కాదు. భోపాల్ దుర్ఘటనకు కొద్ది వారాల ముందే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. దరిమిలా దేశ రాజధానిలో సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఈశాన్య రాష్ట్రాలు తిరుగుబాటు కార్యకలాపాలతో అతలాకుతలమవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి సజావుగా లేదు. మరికొద్దిరోజుల్లో సార్వత్రక ఎన్నికలు జరగనున్న తరుణమది. ముట్టడిలో ఉన్న జాతి మనది.
అంతేకాదు అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా ప్రతిష్ఠ మహోజ్వలంగా వెలిగిపోతో న్న కాలమది. వాషింగ్టన్ పాలకుల మాటకు ఎక్కడా తిరుగులేదు. మిగతా ప్రపంచమంతటికీ నాగరికత లేదా ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించే హక్కు తమకు మాత్రమే ఉన్నదని అమెరికా పాలక వర్గాలు ప్రగాఢంగా విశ్వసిస్తోన్న రోజులవి. మితవాది రోనాల్డ్‌రీగన్ పాలనా కాలమది. సైనిక-పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు అమెరికా విదేశాంగ విధానాన్ని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నాయి.
ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికా అంతిమ విజయానికి చేరువలో ఉన్నది. మరి మన దేశం హిందూ ఆర్థికాభివృద్ధి రేటుతో కునారిల్ల్లుతోంది. ప్రపంచ అగ్రరాజ్యాన్ని సవాల్ చేయగల స్థితిలో లేదు. రాజీవ్‌కు రోనాల్డ్ రీగన్ ఫోన్ చేసి ఆండర్సన్‌ను విడిచి పెట్టమని అడిగినప్పుడు అతడిని స్వేచ్ఛగా తిరిగి వెళ్ళనీయడమే సరైన నిర్ణ యం. జాతి ప్రయోజనాలను రక్షించే ఆచరణాత్మక నిర్ణయం. అటువంటి నిర్ణయాన్నే రాజీవ్ తీసుకున్నారు.
దేశ ప్రతిష్ఠకు నిజమైన కళంకం 1984 డిసెంబర్ 7 (ఆండర్సన్ భారత్ నుంచి నిష్క్రమించిన రోజు)న కాక, ఆ దుర్ఘట న చోటుచేసుకున్న 26 ఏళ్లకు సంభవించింది. విషవాయువు దుర్ఘటన బాధితులకు 470 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించేలా భారత ప్రభుత్వం, యూనియన్ కార్బైడ్ కంపెనీ మధ్య మన సుప్రీం కోర్టు 1989లో మధ్యవర్తిత్వం నెరపింది. బాధితులు లక్ష మందికి కొంచెం ఎక్కువగా ఉంటారని అధికార వర్గాల అంచనా. వాస్తవానికి అంతకు ఐదు రెట్లు ఎక్కు వ సంఖ్యలో ఉన్నారు. ఎవరికీ నష్టపరిహారం సరిగ్గా చెల్లించ నే లేదు.
భోపాల్ కేసులో నిందితులపై అభియోగాలను సుప్రీం కోర్టు 1996లో ఇచ్ఛా పూర్వకంగానే నీరుకార్చివేసింది. అయి తే సిబిఐ ఆ నిర్ణయాలను సవాల్ చేయలేదు. భోపాల్ కేసులో తీర్పు వెలువరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అహ్మది ఆ తరువాత భోపాల్ మెమోరియల్ ట్రస్ట్ హాస్పిటల్‌కు చైర్మన్ గా నియమితులయ్యారు. విషవాయువు దుర్ఘటన బాధితుల కు వైద్యదుపాయాలు కల్పించడానికి నెలకొల్పిన ఆస్పత్రి అది. అయితే పలువురు బాధితులకు ఈ ఆస్పత్రిలో వైద్యం అందలేదని ఇటీవల పలు వార్తలు వెల్లడించాయి.
1984 నుంచి మధ్యప్రదేశ్‌ను కాంగ్రెస్, బిజెపి రెండూ పాలించాయనే వాస్తవాన్ని కూడా మనం విస్మరించకూడదు. కాంగ్రెస్ అత్యధిక కాలం (19 ఏళ్లు) పాలించింది. భోపాల్‌లోని జెపి నగర్ కాలనీకి వెళ్ళండి. ఆ కాలనీలో ఆ కాళరాత్రి 300 మందికి పైగా మరణించారు. మరెంతో మంది శ్వాససంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. మరి ఆ బాధితుల ను ఆదుకోవడానికి ప్రభుత్వాలు ఏమైనా చేశాయా? చేయలేదనేది స్పష్టం. రెండేళ్ల క్రితం వారిలో కొందరు న్యూఢిల్లీలో ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్ళారు. దరిమిలా ఆ అభాగ్యులు వారం రోజుల పాటు తీహార్ జైలులో గడిపారు. ఆండర్సన్‌ను ఎవరు వదిలిపెట్టారనేది ముఖ్యం కాదు. విషవాయువు దుర్ఘటన బాధితులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వానికి 26 ఏళ్లు ఎందుకు పట్టిందనేదే అసలు ప్రశ్న.
తాజా కలం: 1984లో భారత్‌లో ఆండర్సన్ కార్యకలాపాలపై తీసిన విడియోను చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది. 24 గంటల న్యూస్ చానల్స్ ప్రాబల్యం వెలిగిపోతున్న ఈ కాలంలో యూనియన్ కార్బైడ్ అధిపతి నవ్వులు చింది స్తూ ‘బై,బై ఇండియా’ అంటూ నిర్భయంగా మన దేశం నుంచి నిష్క్రమించడం సాధ్యమయ్యేదేనా?

![7pan6b[1] 7pan6b[1]](http://www.3lok.com/wp-content/uploads/2009/10/7pan6b1.jpg)



![[sunitha1244983190.jpg]](http://4.bp.blogspot.com/_5xKaFUEjN8U/SjaAm77cwlI/AAAAAAAAM_o/1a9vV8XwnOs/s1600/sunitha1244983190.jpg)